ఓ మగాడితో డేటింగ్‌.. కరీనా గురించి సైఫ్‌ అలీఖాన్‌కు రాణి ముఖర్జీ సలహా


బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్.. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కరీనా కపూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవడంపై ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వారిద్దరు డేటింగ్ చేస్తున్న తొలినాళ్లలో కరీనా కపూర్‌తో తన ప్రేమ బంధం బలపడేందుకు నటి రాణి ముఖర్జీ అమూల్యమైన సలహాలు ఇచ్చినట్లు సైఫ్ వెల్లడించారు. కరీనా కపూర్‌తో డేటింగ్‌ను ఓ మగాడితో డేటింగ్‌లా భావించి నడుచుకోవాలని రాణి ముఖర్జీ సలహా ఇచ్చినట్లు తెలిపారు. ఇద్దరూ సమానమేనని గుర్తించుకోవాలని, అలా కరీనాతో నడుచుకోవాలని రాణి ముఖర్జీ సైఫ్‌కు సూచించింది. ఒకే ఇంట్లో ఇద్దరు హీరోలు ఉన్నట్లు భావిస్తూ నడుచుకుంటే సమస్యలు ఉండవని, కరీనాపై మగ పెత్తనం చెలాయించాలని చూస్తే మాత్రం ఇబ్బందులు వస్తాయని రాణి హెచ్చరించింది. రాణి ముఖర్జీ ఇచ్చిన డేటింగ్ టిప్‌ను తాను ఎప్పటికీ మరిచిపోనని నవ్వుతూ చెప్పారు సైఫ్.

కరీనాతో డేటింగ్‌కు ముందు ఇద్దరూ కలిసి కొన్ని సినిమాలు చేసినా…తామిద్దరూ కలిసి ఎప్పుడూ బయటకు వెళ్లలేదని ఆయన తెలిపారు. హాలిడేస్ వెకేషన్ ప్లాన్ చేసుకునేటప్పుడు అంతా కరీనా నిర్ణయానికే విడిచిపెడుతానని చెప్పుకొచ్చాడు సైఫ్. ‘నీ ప్లానింగ్, టైమ్ మేనేజ్‌మెంట్ చాలా ఫర్ఫెక్ట్‌గా ఉంటుంది.. అంతా నువ్వే చూసుకో’ అంటూ బాధ్యతలను కరీనాపై నెట్టేస్తానని సైఫ్ వివరించాడు.కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ 2012 అక్టోబర్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

 

CLICK HERE!! For the aha Latest Updates