HomeTelugu Big Stories'దిఘోస్ట్‌' ట్రైలర్‌ విడుదల

‘దిఘోస్ట్‌’ ట్రైలర్‌ విడుదల

The Ghost

అక్కినేని నాగార్జున హీరోగా.. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ఇంటర్ పోల్ ఆఫీసర్ పాత్రలో నాగ్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ – కిల్లింగ్ మెషిన్ గ్లింప్స్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్‌ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ట్రైలర్ ను లాంచ్ చేసి మూవీ యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు.

ట్రైలర్ లో ప్రతీ బిట్ కూడా చాలా గ్రిప్పింగ్ ఉంది. మునుపెన్నడూ లేని విధంగా యాక్షన్-ప్యాక్డ్ గా కనిపిస్తుంది. నాగార్జున సీరియస్ గా చెప్పే డైలాగ్స్ ప్రభావంతంగా ఉన్నాయి. ‘అంతం’ సినిమాలో నాగ్ ను గుర్తు చేస్తున్నాయి. ట్రైలర్ చివర్లో నాగ్ చేతిలో ఆయుధం పట్టుకుని ఒక చైర్ లో ఠీవిగా కూర్చొని ఉండటం.. ఆ పెద్ద కత్తితో విలన్ మీదకు దూకడం వంటి షాట్స్ హైలైట్ గా నిలిచాయి. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ – పుస్కుర్ రామ్ మోహన్ రావు – శరత్ మరార్ సంయుక్తంగా భారీ ఎత్తున ‘ది ఘోస్ట్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu