HomeTelugu Trendingకంగనాకు తాప్సి కౌంటర్‌!

కంగనాకు తాప్సి కౌంటర్‌!

7 12

ఢిల్లీ బ్యూటీ సొట్ట బుగ్గల తాప్సి తన సహనటి కంగనా రనౌత్‌కు కౌంటర్‌ ఇచ్చారు. మహిళా ప్రాధాన్యం ఉన్న ‘మిషన్‌ మంగళ్‌’ సినిమాకు మద్దతు ఎందుకు తెలపలేదని ప్రశ్నించారు. తన చిత్రాలను చిత్ర పరిశ్రమకు చెందిన వారెవ్వరూ సపోర్ట్‌ చేయరని ఇప్పటికే చాలా సార్లు కంగన ఆరోపించారు. మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల గురించి మాట్లాడటానికి ఇష్టపడరని తప్పుపట్టారు. ఈ క్రమంలో తాప్సీతోపాటు అనేక మంది ప్రముఖులపై విమర్శలు చేశారు. ఆమె సోదరి రంగోలీ కూడా ‘తాప్సీ కంగనను కాపీ చేస్తోంది’ ఓ సందర్భంలో మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో తాప్సీ ఇప్పుడు కంగనను ఉద్దేశించి మాట్లాడారు. ఐదు మంది నటీమణులు ఉన్న ‘మిషన్‌ మంగళ్‌’ ను ఎందుకు మెచ్చుకోలేదని ప్రశ్నించారు. ‘ఓ మహిళ మరో మహిళకు మద్దతుగా ఉండాలని ఆమె (కంగన) ఎప్పుడూ చెబుతుంటుంది. మరి ఆమె నా సినిమాను (‘మిషన్‌ మంగళ్‌’)ను ఎందుకు అభినందించనట్లు నాకు తెలియలేదు. ఈ సినిమాలో ఐదుగురు మహిళలు ఉన్నారు. మరి ఆమె మమ్మల్ని మెచ్చుకుందా?. నేను ఆమె జూనియర్‌ని, ఆమెకున్న ఫిల్మోగ్రఫీ నాకు లేదు. అయినప్పటికీ ఇతరులు మెచ్చుకోదగ్గ చిత్రాల్లో నటించా. నటిగా నేను ఇష్టపడే కంగన ఇటీవల నాపై వ్యాఖ్యలు చేయడం నన్ను షాక్‌కు గురి చేసింది. చాలా బాధపడ్డా. నేను కంగన కాపీ అని అంటే నాకు సంతోషమే. ఎందుకంటే ఆమె నాకంటే గొప్ప నటి.. అందులోనూ అత్యధిక పారితోషికం తీసుకునే నటి కూడా. ఓ నటిగా ఆమెను నేనెప్పుడూ ఇష్టపడుతా’ అని తాప్సీ అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!