అవును అతడితో డేటింగ్ చేస్తున్నా: ఇరా

 

Ameer Khan daughter clarity about dating rumoursబాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ కుమార్తె ఇరా సంగీత కళాకారుడు మిశాల్‌తో ప్రేమలో ఉన్నానని స్పష్టం చేసింది. వీరిద్దరు డేటింగ్‌ చేస్తున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ఇరా కూడా మిశాల్‌తో ఉన్న ఫొటోలను తరచూ సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తూనే ఉంది. అతడిని ప్రత్యేకంగా ట్రీట్‌ చేస్తూ… పోస్ట్‌లు చేస్తోంది. దీంతో డేటింగ్‌ వదంతులు బలపడ్డాయి. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఇరాను ఎవరితోనైనా డేటింగ్‌లో ఉన్నారా?అని ప్రశ్నించారు. దీనికి ఆమె ఏ మాత్రం తడుముకోకుండా సమాధానం చెప్పింది. మిశాల్‌ను హత్తుకుని ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ఆయన్ను ట్యాగ్‌ చేసింది. తన కుమార్తె ఇరాకు చిత్ర పరిశ్రమలో రాణించేందుకు ఆసక్తి ఉందని ఇటీవల కాఫీ విత్‌ కరణ్‌ షోలో ఆమిర్‌ అన్నారు. ‘నాకు ఇరా మనసులో ఏముందో కచ్చితంగా తెలియదు. కానీ తనకు ఫిల్మ్‌మేకింగ్‌, సినిమాలంటే ఆసక్తి ఉందని మాత్రం అర్థమైంది. బహుశా.. ఆమె దీన్ని కెరీర్‌గా ఎంచుకుంటుందేమో.. నాకైతే తెలియదు’ అని అన్నారు.