HomeTelugu Trending'లవ్‌ స్టోరీ'కి 'టైటానిక్‌'లాంటి ఎమోషన్‌ టచ్‌

‘లవ్‌ స్టోరీ’కి ‘టైటానిక్‌’లాంటి ఎమోషన్‌ టచ్‌

9 10
ప్రపంచ సినిమా చరిత్రలో చెప్పుకునే సినిమాల్లో ‘టైటానిక్’ సినిమా ఒకటి. ఈ సినిమాను జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టిన సంగతి తెలిసిందే. ఇందులో క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తాయి. పడవలో కలిసి ప్రయాణం చేస్తున్న హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టడం, దానిని నిలబెట్టుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నం చివరికి పడవ ప్రమాదం జరగడం… హీరో చనిపోయినా అతని జ్ఞాపకాలతో బ్రతికేయడం వంటివి సినిమాలో చూపించారు. లవ్, ఎమోషన్ సినిమాకు ప్రాణం అయ్యింది.

అయితే, ఇలాంటి ఎమోషన్ టచ్ ను ఇప్పుడు శేఖర్ కమ్ముల తన లవ్ స్టోరీ సినిమాకు ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా లవ్ స్టోరీ. ఫ్రెష్ లవ్ స్టోరీగా శేఖర్ కమ్ముల తీర్చిదిద్దుతున్నారు. ఇందులో టైటిల్ సినిమాలోని ఎమోషన్ లవ్ ను టచ్ చేయబోతున్నారు. అలాంటి ట్రీట్మెంట్ ఈ సినిమాలో కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. హాలీవుడ్ సినిమా కాబట్టి వర్కౌట్ అయింది. కానీ టాలీవుడ్ లో సెంటిమెంట్ ఉన్నది. విషాదాంతమైన ముగింపు తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. మరి ప్రేక్షకులకు అర్ధమయ్యేలా ఎలా మెప్పిస్తారో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!