HomeTelugu Trendingవిశ్వక్‌ సేన్‌ కు టాలీవుడ్‌ యంగ్‌ హీరోల మద్దతు

విశ్వక్‌ సేన్‌ కు టాలీవుడ్‌ యంగ్‌ హీరోల మద్దతు

Viswaksen

టాలీవుడ్ యంగ్‌ హీరో విశ్వక్ సేన్ వివాదాలలో ఇరుక్కొని సతమతమవుతున్న సంగతి తెలిసిందే. అయితే విశ్వక్‌ యంగ్ హీరోకు.. కుర్ర హీరోలు సపోర్ట్ గా నిలవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ పేరు గత మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా ప్రమోషన్ కోసం ఫ్రాంక్ వీడియో చేయడం.. దాని డిబేట్ కోసం ఒక టీవీ ఛానెల్ కు వెళ్లి యాంకర్ ను అనరాని మాట అనడం.. అది కాస్త వైరల్ గా మారి విశ్వక్ కెరీర్ నే దెబ్బ తీసేలా మారడం చకచకా జరిగిపోయాయి.

ఇక లోపల ఎంత బాధ ఉన్నా కానీ విశ్వక్ దాన్ని పైకి చూపించకుండా తన సినిమా ప్రమోషన్స్ కోసం తిరుగుతుండడం నిజంగా విశేషమనే చెప్పాలి. ఇక వీటన్నింటిని పక్కన పెట్టి కుర్ర హీరోలు విశ్వక్ సేన్ కు సపోర్ట్ గా నిలిచారు. విశ్వక్ నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాపై తమదైన రివ్యూ ఇచ్చి, ఆల్ ది బెస్ట్ చెప్పుకొచ్చారు. ఈ హీరోల్లో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఉండడం గమనార్హం. సిద్దు జొన్నలగడ్డ, సాయి ధరమ్ తేజ్, రాహుల్ రామకృష్ణ, డైరెక్టర్ హరీష్ శంకర్, డైరెక్టర్ సరోజ్ కుమార్, విశ్వక్ కు సపోర్ట్ చేస్తూ పోస్ట్లు పెడుతున్నారు. ఇక వీరి ట్వీట్ చూసి నెటిజన్లు ఒక హీరో కోసం ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు అంటే టాలీవుడ్ ఎంత గొప్పది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!