నాగచైతన్యతో త్రివిక్రమ్‌ సినిమా.. కానీ దర్శకుడిగా కాదు!


అక్కినేని నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వస్తున్న సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఆ తరవాత పరుశురాం తో కూడా సినిమా చేయబోతున్నాడు. ఇదిలా ఉంటే త్రివిక్రమ్‌ తో నాగ చైతన్య సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే త్రివిక్రమ్ దర్శకుడిగా కాకుండా నిర్మాతగా ఈసినిమాను తెరకెక్కించనున్నాడని తెలుస్తుంది. అంతేకాకుండా త్రివిక్రంతో పాటు హీరో నాని కూడా నిర్మాతగా మారనున్నడట. ఈసినిమాకు త్రివిక్రమ్.. నాని ఇద్దరూ నిర్మాతలు గా ఉంటారు. ఈ సినిమాకు దశరథ్ కథ తయారు చేశాడని సమాచారం. అయితే డైరెక్టర్‌ ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా ముగ్గురు అన్నదమ్ముల మధ్య సాగే కథ అని.. చైతు తో పాటుగా మరో ఇద్దరు హీరోలు కూడా ఉంటారు అని అంటున్నారు. మరి ఈవార్తల్లో ఎంత నిజం ఉన్నదనేది తెలియాల్సి ఉంది.