చైతుతో త్రివిక్రమ్..?

తన కొడుకు నాగచైతన్య హీరో త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేయడానికి అక్కినేని నాగార్జున గట్టి ప్రయత్నాలే చేశారు. కానీ త్రివిక్రమ్ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడం వలన చైతుతో సినిమా చేసే అవకాశం రాలేదు. కానీ త్వరలోనే ఈ సినిమా పట్టాలేక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు. నాగార్జున నిర్మాతగా చైతు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా రూపొందనుంది.
ఈ విషయమై నాగ్, త్రివిక్రమ్ ను ఒప్పించడం జరిగిపోయిందని చెబుతున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ , పవన్ కల్యాణ్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటుంటున్నాడు. చైతు కూడా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ పూర్తయిన వెంటనే వీరిద్దరు సెట్స్ పైకి వెళ్తారని చెబుతున్నారు. మరి త్రివిక్రమ్, ఎన్‌టి‌ఆర్ తో కూడా సినిమా
చేయనున్నాడనే వార్త బయటకు వచ్చింది. మరి ఆ సినిమా ఏమైనట్టో.. త్రివిక్రమే చెప్పాలి!