
Anushka Upcoming Movies:
తెలుగు సినిమా పరిశ్రమలో తన ప్రత్యేకమైన నటనతో గుర్తింపు పొందిన అనుష్క శెట్టి గత కొంత కాలంగా వెయిట్ లాస్ సమస్యలతో బాధపడుతున్నారు. గతంలో తన బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, అనుష్కకు అనుకున్న ఫలితం రాలేదు.
ఆమెను మళ్ళీ పెద్ద తెరపై చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంలో ఆమె నటనను ప్రేక్షకులు అభిమానించారు.. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.
ఇప్పుడు అనుష్క రెండు పెద్ద చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. వీటిలో మొదటి చిత్రం క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఘాటి. క్రిష్ మొదట పవన్ కళ్యాణ్ కోసం హరి హర వీరమల్లు అనే చిత్రాన్ని తెరకెక్కించాల్సి ఉండగా, చివరికి ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకొని ఘాటి చిత్రానికి సైన్ చేశారు.
ఘాటిలో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ చిత్రం తెలుగులో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని అంచనా.
ఇంకో సినిమా మలయాళంలో తెరకెక్కిన కథానార్: ది వైల్డ్ సోర్సరర్. ఈ చిత్రానికి రొజిన్ థామస్ దర్శకుడు కాగా, జయసూర్య, ప్రభుదేవా, వినీత్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ గోకుళం మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇది భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక ప్రత్యేకమైన ప్రయత్నంగా చెప్పవచ్చు.
సినిమా షూటింగ్ పూర్తయింది.. వచ్చే ఏడాది ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రెండు సినిమాలతో అభిమానులు అనుష్కను మళ్ళీ తెరపై చూడటానికి ఆసక్తిగా ఉన్నారు.
Read More: Allu Arjun పుష్ప 2 కోసం తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?













