వేదాంత ధోరణిలో ఉపాసన ట్వీట్‌..


మెగా కోడలు ఉపాసన కొణిదెల.. ఓ బిజినెస్ ఉమన్‌గా, సామాజిక వేత్తగా, రామ్ చరణ్ సతీమణిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయిన ఆమె… ఫిట్‌నెస్ మంత్ర జపిస్తున్నారు. తాజాగా న్యూఇయర్‌కి గ్రాండ్ వెల్‌కం చెప్పేందుకు ఆమె అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. కొంత మంది అమ్మాయిలతో కలిసి… ఈ సాహసోపేత జర్నీ ప్రారంభించారు. ముందుగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ని చేరుకోవాలనీ, ఆ తర్వాత ముక్తినాథ్ ఆలయాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నారు. చివరిగా పసుపతి నాథ ఆలయాన్ని దర్శించుకోవాలని అనుకున్నారు. తిరిగి 48 గంటల్లో ఇంటికి చేరాలని ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. ఐతే… ఆమె అనుకున్నది అనుకున్నట్లు జరగలేదు. ప్రస్తుతం ఎవరెస్ట్ ప్రాంతాల్లో భారీ ఎత్తున మంచు కురుస్తోంది. అందువల్ల ఉపాసన టీమ్ ముందుకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా ఆమె… నేపాల్‌లోనే ఉన్నారు. అక్కడి నుంచీ జర్నీ ఎప్పుడు మొదలు పెట్టేదీ త్వరలోనే తెలుస్తుందని తన ఫ్యాన్స్‌కి మెసేజ్ పెట్టారు. ఈ సందర్భంగా… తాము ఒకటి తలిస్తే… దైవం / తలరాత మరొకటి తమ కోసం సిద్ధం చేసిందంటూ వేదాంత ధోరణిలో తెలిపారు. ఇప్పుడీ పోస్ట్ ఆటోమేటిక్‌గా వైరల్ అయ్యింది. నటి కియారా అద్వాని సహా 80వేల మందికి పైగా ఈ పోస్టును లైక్ చేశారు.