స్వీట్‌ మెమోరీని షేర్ చేసిన ఉపాసన


మెగా కోడలు, పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన ఫాలోవర్స్‌కు మంచి మంచి హెల్త్ టిప్స్ కూడా అందిస్తుంటారు. అదే విధంగా తన వ్యక్తిగత విషయాల్ని కూడా షేర్ చేస్తుంటారు. అయితే తాజాగా ఉపాసన తనకు సంబంధించిన చాలా స్వీట్ మెమోరీని షేర్ చేశారు. సాధారణంగా ఇలాంటి ఘటన చాలా కొంతమందికి మాత్రం జీవితంలో ఎదురవుతూ ఉంటుంది. అది ఏంటంటే.. ఉపాసన వద్దకు ఓ డాక్టర్ వచ్చి కలిశారు. అంతేకాదు ఆమె సూటిగా ఉపాసనకు ఓ ప్రశ్న కూడా వేశారు. ‘నేను ఎవరో నీకు తెలుసా ’ అంటూ ఉపాసనను క్వశ్చన్ చేశారు. దీంతో షాక్ తిన్న ఉపాసనకు ఆమె బదులుకూడా ఇచ్చారు. ‘నా పేరు డాక్టర్. సి. సరస్వతి.. నిన్ను పుట్టించిన డాక్టర్ నేనే అంది’. ఆ డాక్టర్ అలా చెప్పగానే… ఉపాసన ఒక్కసారి ఆశ్చర్యానికి గురయ్యారు. అంతే కాదు సూపర్.. నేను ప్రపంచంలోకి రాగానే నన్ను మొట్టమొదట చూసిన వ్యక్తిని నేను కలవడం చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నానని ఉపాసన ట్వీట్ చేసింది.