వజ్ర కవచధర గోవింద టీజర్‌.. సప్తగిరి.. ‘ఓ’ యాక్షన్‌ చూశారా..!

స్టార్‌ కమెడియన్ సప్తగిరి తన కామెడీ టైమింగ్‌తో మెప్పించి ఇప్పుడు.. హీరోగా మారిపోయి.. వజ్ర కవచధర గోవింద అనే టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. కమెడియన్ కాబట్టి కామెడీ సినిమా అనుకుంటే పెద్ద పొరపాటు చేసినట్టే అవుతుందని టీజర్ చూస్తే తెలుస్తోంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. ఈ టీజర్ లో.. సప్తగిరి టైమింగ్ తో పాటు డైలాగ్ డెలివరీలో మంచి రైమింగ్ కనిపించింది. పక్కా యాక్షన్ గా సాగే కొన్ని ఫైట్స్ ను చూపించాడు. నేనో వలస పక్షిని.. నాకంటూ ఓ గమ్యం లేదు.. అని చెప్పడంతో ఎక్కడైనా ఉంటా అని చెప్పేటట్టుగా చూపించాడు. నాకోసం నలుగురు వచ్చారు.. స్నేహితులున్నారు. మరో అందమైన అమ్మాయి వచ్చింది.. ప్రియురాలు అంది. తెలియకుండా గుంపులు గుంపులుగా వచ్చారు.. శత్రువులన్నారు. అనే డైలాగుతో టీజర్ ను కట్ చేశారు. ఇంటరెస్టింగ్ గా సాగింది. ఇక చివర్లో కత్తిని పదును పెట్టె సమయంలో అందులో వచ్చే నిప్పులను మంచినీళ్లు తాగినట్టు తాగడం పెద్ద హాస్యంగా మారింది.