‘పలాస 1978’ ఫస్ట్‌లుక్‌

‘లండన్ బాబులు’ ఫేం రక్షిత్ హీరోగా నటిస్తున్న సినిమా ‘పలాస 1978’. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. నక్షత్ర ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో బిక్రమ్ కృష్ణ ఫిలింస్ పతాకంపై అప్పారావు బెల్లన, అట్లూరి వరప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ గాయకుడు రఘు కుంచె ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.