మహేష్‌బాబు మల్టీప్లెక్స్‌లో పవర్ స్టార్ హవా


సూపర్ స్టార్ మహేష్‌బాబు మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతంలో MMB మల్టీప్లెక్స్ థియేటర్ లను నిర్మించిన సంగతి తెలిసిందే. జంట నగరాల్లోనే పాపులర్‌ మల్టీప్లెక్స్‌గా పేరొందినది. ఇందులో మొత్తం 7 స్ర్కీన్స్ ఉన్నాయి. అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా సినిమా వకీల్ సాబ్ ఈ నెల 9న విడుదల అవుతోంది. మహేష్‌కు చెందిన MMB మల్టీప్లెక్స్‌లోని 7 స్క్రీన్లలోనూ ఈ సినిమా ప్రదర్శించబోతున్నారు. తొలిరోజు మొత్తం 27 షోలకు గాను అన్నీ హౌస్‌ఫుల్ అయిపోయాయట. దీంతో ఈ మల్టీప్లెక్స్ నిర్మించిన తర్వాత ఇదే రికార్డ్. పవన్ కల్యాణ్ మూవీకి ఎంత బజ్‌ ఉందో దీన్ని బట్టే తెలుస్తోంది. అంతే కాకుండా ఏపీ, తెలంగాణలోని అన్ని షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ హౌస్ ఫుల్ అయిపోయాయి. ఇదంతా ఓపెన్ అయిన కొద్ది నిమిషాల్లోనే బుక్ అయిపోయాయి.

సూపర్ స్టార్ మహేశ్ బాబు కేవలం పాపులర్ హీరో మాత్రమే కాదు… ప్రొడ్యూసర్ అండ్ ఎగ్జిబిటర్ కూడా. ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ నారంగ్ తో కలిసి మహేశ్ బాబు మూడేళ్ళ క్రితం కొండాపూర్ లో ఎ.ఎం.బీ. మల్టీప్లెక్ట్స్ థియేటర్లను నిర్మించాడు. ట్విన్ సిటీస్ లో మోస్ట్ పాపులర్ అండ్ క్రేజీస్ట్ మల్టిప్లెక్స్ గా ఏఎంబీ నిలిచింది. ఇందులో మొత్తం ఏడు స్క్రీన్స్ ఉన్నాయి. విశేషం ఏమంటే… ఈ నెల 9న జనం ముందుకు రాబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ఈ మల్టీప్లెక్స్ లోని ఏడు స్క్రీన్స్ లోనూ ప్రదర్శితం కాబోతోంది. అది కాదు అసలు విషయం… ఈ మూవీకి సంబంధించిన ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్ ను ఓపెన్ చేయగానే నిమిషాల వ్యవథిలో ఓపెనింగ్ రోజుకు ఈ ఏడు స్క్రీన్స్ హౌస్ ఫుల్ అయిపోయాయి. ఫస్ట్ డే మొత్తం 27 షోస్ ను వేస్తుంటే… అన్నీ హౌస్ ఫుల్ కావడం అనేది ఈ మల్టీప్లెక్స్ మూడేళ్ళ చరిత్రలో ఫస్ట్ టైమ్ అట! పవన్ కళ్యాణ్ మూవీకి ఎంతటి బజ్ ఉందో తెలియడానికి ఏఎంబీనే ఉదాహరణగా తీసుకోవాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలోని మల్టీప్లెక్స్ లలో ఈ మూవీ మొదటి రోజు అన్ని షోస్ హౌస్ ఫుల్ కాగా శని, ఆదివారాల్లోనూ ఇప్పటికే 80 శాతంకు పైగా టిక్కెట్స్ ఆన్ లైన్ లో బుక్ అయిపోయాయట. సో.. పవర్ స్టార్ స్టామినా ఏమిటనేది… శుక్రవారం మరోసారి నిరూపితం కాబోతోంది!!

CLICK HERE!! For the aha Latest Updates