బాలకృష్ణ 107వ సినిమాలో వరలక్ష్మీ


నందమూరి బాలకృష్ణ హీరోగా.. గోపీచంద్‌ మలినేని డైరెక్షన్‌లో ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో హీరోయిన్‌ వరలక్ష్మి శరత్‌కుమార్‌ కనిపించనున్నట్లు మూవీయూనిట్‌ స్పష్టం చేసింది. ఈ విషయంపై వరలక్ష్మి స్పందిస్తూ.. ‘‘క్రాక్‌’ అనంతరం నాకెంతో ఇష్టమైన దర్శకుడు గోపీచంద్‌ మలినేనితో కలిసి బాలయ్య సినిమా కోసం పనిచేయడం ఆనందంగా ఉంది. సెట్‌లోకి అడుగుపెట్టేందుకు ఎదురుచూస్తున్నాను’ అని తెలిపారు.

వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలయ్య ఫుల్‌ మాస్‌‌, పవర్‌ఫుల్‌ లుక్‌లో అలరించనున్నట్లు సమాచారం. గురువారం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా NBK107 గురించి అధికారిక ప్రకటించారు. ఈ మూవీని మైత్రిమూవీ మేకర్స్‌ నిర్మిస్తుంది. ఈ సినిమాకి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది విడుదలైన ‘క్రాక్‌’ సినిమాలో వరలక్ష్మి జయమ్మగా నటించి.. అలరించిన ససంగతి తెలిసిందే.

CLICK HERE!! For the aha Latest Updates