పవన్ కంటే విజయ్ బెటర్: వర్మ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. ట్విట్టర్ అకౌంట్ ఉన్నంతవరకు పవన్ కల్యాణ్ రాజకీయ విధానాలపై కామెంట్స్ చేస్తూ ఉన్న వర్మ ఇప్పుడు అకౌంట్ ను క్లోజ్ చేసి ఫేస్ బుక్ మీద పడ్డాడు. ఈసారి పవన్ కల్యాణ్ కంటే యంగ్ హీరో విజయ్ దేవరకొండ బెటర్ అంటూ వర్మ చేసిన కామెంట్స్ వివాదాలకు దారి తీస్తున్నాయి. ‘అర్జున్ రెడ్డి’ సినిమా విషయంలో వర్మ.. మొదటినుండి కూడా విజయ్ దేవరకొండను పొగుడుతూనే ఉన్నాడు. అయితే ఈసారి ఆ పొగడడంలో కొత్తదనం చూపించాలనుకున్నాడో.. ఏమో కానీ పవన్ అభిమానులు ఆగ్రహించేలా విజయ్ ను పొగిడాడు.
‘విజయ్ కు ఉన్న చరిష్మా, అందం పవన్ కంటే పది రెట్లు బెటర్. నటన విషయంలో విజయ్.. పవన్ కంటే ఇరవై రెట్లు బెటర్’ అంటూ కామెంట్ చేశాడు. అంతటి ఆగాడు అనుకుంటే పొరపాటే.. విజయ్ దేవరకొండ నటనలో ఉన్న సహజత్వాన్ని బట్టి రియల్ సూపర్ స్టార్ అయ్యే అర్హత తనకే ఉందంటూ పేర్కొంటూ ఓ ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. దీంతో పవన్ అభిమానులు వర్మపై విరుచుకు పడుతున్నారు. ఒకట్రెండు హిట్లు పడగానే పవన్ కు సరిసమానులు అవుతారా..? అసలు విజయ్ ను పవన్ తో ఎలా పోలుస్తారంటూ..? వర్మపై ఫైర్ అవుతున్నారు.