వర్మ ఇకపై తక్కువ మాట్లాడతాడట!

రామ్ గోపాల్ వర్మ ఇకపై తక్కువ మాట్లాడతాడట. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు.. స్వయంగా వర్మనే. అదేంటి ఇలాంటి స్టేట్మెంట్లు వర్మ చేయడు కదా అనుకుంటున్నారా..? అదే మరి రామ్ గోపాల్ వర్మ అంటే. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఆయన వరుసగా కామెంట్లు చేస్తూనే ఉన్నాడు.దీంతో ఆయన ఎక్కువ మాట్లాడుతూ.. తక్కువ పని చేస్తున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అయితే ఇకపై ఆ విమర్శలకు తావివ్వనని చెబుతున్నాడు.

నాగార్జున-వర్మ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఈరోజు మొదలయిన సంగతి తెలిసిందే. ఈ సంధర్భంగా వర్మ మాట్లాడుతూ.. ఇక నుండి తక్కువ మాట్లాడి, ఎక్కువ పని చేసి తానెంటో నిరూపించుకుంటానని చెప్పుకొచ్చాడు వర్మ. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్, నాగార్జున స్టిల్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. నాగ్ ఎన్నడూ కనిపించని కొత్త లుక్ తో ఈ స్టిల్స్ లో దర్శనమిచ్చాడు.