‘వాల్మీకి’ టీజర్‌ ఎప్పుడంటే!

మెగా హీరో వరుణ్ తేజ్‌ తొలిసారిగా హీరోగా నటిస్తున్న సినిమా ‘వాల్మీకి’. కోలీవుడ్‌లో సూపర్‌ హిట్ అయిన జిగర్తాండ సినిమాను తెలుగులో వాల్మీకి పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మరో కీలక పాత్రలో తమిళనటుడు అధర్వ మురళీ నటిస్తుండగా పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించనున్నారు మూవీ యూనిట్‌. ఇప్పటికే టైటిల్‌ లుక్‌లో ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లతో ఆకట్టుకోగా స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా ఆగస్టు 15న టీజర్‌ను రిలీజ్‌ చేస్తున్నట్టుగా ప్రకటించారు. 14 రీల్స్‌ ప్లస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 13న విడుదల కాబోతుంది