
సినియర్ నటుడు శోభన్ బాబు, అతిలోకసుందరి శ్రీదేవి కాంబినేషన్‌లో వచ్చిన వెల్లువచ్చె గోదారమ్మ సాంగ్ ఎప్పటికీ పాపులరే. బిందెల మధ్య గోదారి ఒడ్డున వీరిద్దరు డ్యాన్స్ చేస్తూ సాగే పాట ఇప్పటికీ అందరినీ ఉర్రూతలూగిస్తుంది. దీన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు వాల్మికీ మూవీ టీం రెడీ అయ్యింది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పూజా హెగ్డే మధ్య ఈ సాంగ్‌ను తెరకెక్కించారు. ఈ సాంగ్ మేకింగ్ వీడియోను మూవీయూనిట్ తాజాగా విడుదల చేసింది.
ఒరిజనల్ పాటకు ఏ మాత్రం తీసిపోకుండా.. ఈ పాట ఉండబోతున్నట్లు అందులో స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఈ పాటలో పూజా హెగ్డే కూడా తన అందాలతో అదరగొడుతోంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో ఆకట్టుకున్న వాల్మీకిపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. రిమేక్ సాంగ్‌తో అభిమానుల అంచనాలు మరింత పెంచేశాయి. మరి ఆనాటి సాంగ్ షూటింగ్‌లో ఈ సరికొత్త జోడి ఎలా మెప్పించబోతున్నారనేది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.













