HomeTelugu Trendingవిజయ్‌ దేవరకొండ తాజా మూవీ హీరో

విజయ్‌ దేవరకొండ తాజా మూవీ హీరో

4 19
సెన్సేషనల్‌ స్టార్ విజయ్‌ దేవరకొండ మరో సినిమాను ప్రారంభించాడు. ఇప్పటికే విజయ్‌ హీరోగా తెరకెక్కిన డియర్‌ కామ్రేడ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. క్రాంతికుమార్ దర్శకత్వంలో మరో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ షూటింగ్ జరుగుతోంది. ఈ రెండు సినిమాలతో పాటు మరో సినిమాను కూడా మొదలుపెట్టాడు విజయ్‌ దేవరకొండ. మరోసారి మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో బహు భాషా చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు హీరో అనే టైటిల్‌ను నిర్ణయించారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో విజయ్‌ బైక్‌ రేసర్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమాతో మలయాళ నటి మాళవిక మోహనన్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతోంది. విజయ్‌ దేవరకొండ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను కూడా తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లోనూ
విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu