
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ చిత్రానికి ‘ఫైటర్’ అనే పేరు ప్రచారంలో ఉంది. యాక్షన్ ప్రధానాంశంగా సాగే ఓ ప్రేమ కథతో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ థాయ్‌లాండ్ వెళ్లి మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రంలో విజయ్ వినూత్నమైన గెటప్‌తో ప్రేక్షకులను అలరించనున్నాడు విజయ్. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పూజా కార్యక్రమం నేడు ముంబయిలో వేడుకగా జరిగింది. ముహుర్తపు షాట్‌లో భాగంగా ఛార్మి క్లాప్ కొట్టారు. ముహుర్తపు షాట్‌కు సంబంధించిన ఫొటోలతోపాటు వీడియోను ఛార్మి ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
అయితే ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ‘ఫైటర్’ సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తారని కొన్ని రోజుల క్రితం జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ప్రస్తుతం బాలీవుడ్ నటి అనన్యపాండే పేరు వినిపిస్తోంది. దీనిపై ఎటువంటి స్పష్టత రాలేదు.
To new beginnings 💖
Shoot begins in mumbai from today 💪🏻@TheDeverakonda @purijagan @karanjohar @PuriConnects @DharmaMovies #VD10 #PJ37 #PCfilm #PanIndia 😍 pic.twitter.com/g8MOAk9EQY— Charmme Kaur (@Charmmeofficial) January 20, 2020












