
యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ సినిమాకోసం విజయ్ తెగ హడావిడి చేసాడు. గత వరం రోజులుగా ప్రమోషన్స్‌లో మునిగి పోయాడు. చివరకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక ఈ సినిమాకు డివైడ్ టాక్ వస్తుంది. హడావిడంతా విజయలోనే ఉంది కానీ సినిమాలో ఎం లేదంటున్నారు చూసినవాళ్లు. ఇదిలా ఉంటే తాజాగా విజయ్ చేసిన ఒక కామెంట్ ఇప్పుడు వివాదంగా మారింది.
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో రాశిఖన్నాతో కలిసి విజయ్ పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో రాశిఖన్నా తాను డాక్టర్ తో డేటింగ్ చేయాలని అనుకుంటున్నాను అంటూ చెప్పింది. విజయ్ స్పందిస్తూ డాక్టర్స్ లో రొమాంటికి యాంగిల్ ఉండదు అంటూ వ్యాఖ్యానించాడు. డాక్టర్లతో డేటింగ్ అంటే వేరేలా ఉంటుంది. వారు బాడీని.. బుగ్గలను.. చెస్ట్ ను సైటిఫిక్ నేమ్స్ తో పిలుస్తారు అంటూ వారిలో రొమాంటిక్ యాంగిల్ ఉండదు. అని ఆటపట్టించాడు. ఈ వ్యాఖ్యలపై డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది. మరో వైపు లేడీస్ గురించి కూడా విజయ్ తప్పుగా మాట్లాడని అంటున్నారు. మరి ఈ వివాదం పై విజయ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.













