నిర్మాతగా ‘అర్జున్ రెడ్డి’!

అర్జున్ రెడ్డి సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ అయ్యాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా తర్వాత అతని జాతకమే మారిపోయింది. ప్రస్తుతం విజయ్ అగ్ర నిర్మాతల బ్యానర్ లో సినిమాలు చేస్తూ బిజీ అయ్యాడు. ఇదిలా ఉండగా విజయ్ నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. కేవలం నిర్మాతగా మాత్రమే కాదు ఈ సినిమాలో హీరో కూడా విజయనేనట….ఇక డైరెక్టర్ గా శేఖర్ కమ్ముల వ్యవహరించనున్నాడు.

ఇటీవలే విజయ్ కు కథ చెప్పాడట. కథ చాలా బాగుండడంతో సినిమాలో నటించడమే కాదు ఆ సినిమాని తానె నిర్మిస్తానని మాట ఇచ్చాడట. గతంలో శేఖర్ దర్శకత్వం వహించిన లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ సినిమాలో విజయ్ చిన్న రోల్ చేశాడు. కాకపోతే ఆ రోల్ పెద్దగా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం విజయ్ పరుశురాం దర్శకత్వం లో ఓ మూవీ చేస్తున్నాడు. ఇది ఫిబ్రవరి లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.