విక్రమ్ సినిమాలో ఆ ఇద్దరు!

ప్రస్తుతం స్టార్ హీరో విక్రమ్ భారీ బడ్జెట్ తో కూడిన రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. అందులో ‘స్కెచ్’ ఒకటి అలానే గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తోన్న ‘దృవ నక్షత్రం’ ఒకటి. గౌతమ్ మీనన్ సినిమాలో విక్రమ్ రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ చాలావరకు విదేశాల్లోనే జరుగుతోంది. ఇటీవల ఈ సినిమాకు బ్రేక్ ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి కానీ సినిమా షూటింగ్ మాత్రం యాధావిధిగా జరుగుతూనే ఉంది. ఈ కథను సంబందించి రెండు కీలక మహిళల పాత్రలు ఉంటాయని సమాచారం.

ఈ పాత్రల కోసం సీనియర్ హీరోయిన్స్ రాధిక, సిమ్రాన్ లను సంప్రదించగా వారు అంగీకరించినట్లు తెలుస్తోంది. విక్రమ్ కాంబినేషన్స్ లో వాళ్ళ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. త్వరలోనే ఈ చిత్రబృందం దుబాయి, బల్గేరియా వంటి ప్రాంతాలకు వెళ్లనున్నారు. విక్రమ్ కెరీర్ లో ఇదొక చెప్పుకోదగిన సినిమాగా నిలుస్తుందని అంటున్నారు.