HomeTelugu NewsVishwambhara : విశ్వంభర అప్డేట్‌.. ఫ్యాన్స్‌ ఖుషి

Vishwambhara : విశ్వంభర అప్డేట్‌.. ఫ్యాన్స్‌ ఖుషి

Vishwambhara release date a
Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. సోషియా ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకి బింబిసార ఫేం మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్‌ లుక్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించేలా ఉంది. చిరంజీవి 156 వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభమయింది.

త్వరలో చిరంజీవి షూటింగ్‌లో జాయిన్‌ కానున్నాడు. ఈ క్రమంలో చిరంజీవి వర్కౌట్స్‌ చేస్తూ.. విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కి మరో అదిరిపోయే న్యూస్‌ చెప్పారు మేకర్‌. ఈ చిత్రాన్ని 2025 జనవరి 10న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

పురాణాలు ఢీకొట్టినప్పుడు లెజెండ్స్‌ ఉద్భవిస్తారు.. అనే క్యాప్షన్‌ పోస్టర్‌లో కనిపిస్తుండగా.. చిరు స్టైలిష్‌ వాక్‌తో కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నట్టుగా ఉన్న లుక్‌ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. 2025 జనవరికి మెగా ఫ్యాన్స్‌కి ఫుల్‌ మీల్స్‌ పక్క అని చిరంజీవి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్‌ తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఆరు పాటలుంటాయని ఎంఎం కీరవాణి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.

ఎంతో ప్రతిష్టత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా చిరంజీవి కెరీయర్‌లో వన్‌ ఆఫ్‌ ద బెస్ట్‌ అవుతుంది టాలీవుడ్‌ టాక్‌. 2024 పలు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. వీటి మధ్య థియేటర్స్‌ కోసం గట్టి పోటీనే జరిగింది. ఈ క్రమంలో పలు సినిమా పక్కకు తప్పుకున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu