మంచు విష్ణు ‘ఓటర్’ ట్రైలర్‌

హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ఓటర్’. జీఎస్‌ కార్తిక్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ‘అహింస మార్గం ద్వారా ఒక్క బుల్లెట్‌ కూడా కాల్చకుండా స్వాతంత్ర్యం తెచ్చుకున్న దేశం మనది. మనం పేదరికంపై పోరాటం చేశాం కానీ పేదలపై పోరాటం చేయలేదు. మార్పు మనలో రావాలి.. మారాలి.. మార్చాలి’ అని మంచు విష్ణు చెబుతున్న డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. నటుడు సంపత్‌ రాజ్‌ ఇందులో రాజకీయనాయకుడిగా నటించారు. ‘నువ్వు ఆఫ్ట్రాల్‌ ఒక ఓటర్’ అని చీదరించుకుంటున్నట్లు సంపత్‌ చెబుతున్న డైలాగ్‌కు.. ‘నేను ఆఫ్ట్రాల్‌ ఒక ఓటర్‌ను కాను ఓనర్‌..’ అని విష్ణు చెబుతున్న డైలాగ్‌ టీజర్‌లో హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమాను తమిళంలోనూ విడుదల చేస్తున్నారు. సినిమాకు తమన్‌ సంగీతం అందించారు. ఇందులో సురభి హీరోయిన్‌గా నటించారు. రామా రీల్స్‌ బ్యానర్‌పై జాన్‌ సుధీర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

CLICK HERE!! For the aha Latest Updates