ఎన్టీఆర్‌తో వైజయంతి మూవీస్ భారీ సినిమా..!

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి ‘వంటి ఆల్ టైమ్ రికార్డ్‌ సినిమాని నిర్మించిన వైజయంతి మూవీస్ సంస్థ.. కొంతకాలం పాటు నిశ్శబ్దంగా ఉంది. ఆ తరువాత, మహానటి సినిమాతో తిరిగి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి..ఈ సంస్థ హిట్ కొట్టింది. మహానటి ఇచ్చిన హిట్ తో.. వైజయంతి మూవీస్ సంస్థ భారీ సినిమాలు నిర్మించేందుకు సిద్ధమైంది.

ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి సినిమాకు ఒక ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నది. ఈ సినిమా తరువాత మరో రెండు సినిమాలు చేసేందుకు వైజయంతి మూవీస్ సిద్ధమైనట్టు తెలుస్తున్నది. అందులో ఒకటి జూనియర్ ఎన్టీఆర్ సినిమా కాగా, రెండో సినిమా విజయ్ దేవరకొండతో సినిమా చేయబోతున్నట్టు సి అశ్వినీదత్ పేర్కొన్నారు. అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా కూడా చేస్తారట.

ప్రస్తుతం కింగ్ నాగార్జున, నాని మల్టీ స్టారర్ గా వస్తున్న దేవదాస్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కాబోతుండగా.. సెప్టెంబర్ 20 వ తేదీన ఆడియో వేడుకను భారీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.