HomeTelugu Newsకత్తులతో పొడుచుకున్న రజనీ, అజిత్‌ అభిమానులు

కత్తులతో పొడుచుకున్న రజనీ, అజిత్‌ అభిమానులు

10 8
సంక్రాంతి పండుగ కావటంతో స్టార్‌ హీరోల సినిమాలు క్యూ కట్టాయి. బడా స్టార్స్‌ ఒకేసారి థియేటర్లలో సందడి చేస్తుండటంతో ఫ్యాన్స్‌ మధ్య గొడవలు మాటల యుద్ధాన్ని దాటి ప్రత్యక్ష దాడులకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఇద్దరు టాప్ హీరోల సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన పేట, అజిత్‌ ద్విపాత్రాభినయం చేసిన విశ్వాసం సినిమాలు ఈ రోజు(గురువారం) రిలీజ్‌ అయ్యాయి.

దీంతో ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పలు చోట్ల ఫ్యాన్స్‌ ఘర్షణలకు దిగటంతో పరిస్థితి చేయిదాటిపోయింది. వేలూరులోని ఓ థియేటర్‌ ముందు ఇరువర్గాల అభిమానులు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ సంఘటనలో గాయపడిన నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. రెండు సినిమాలకు పాజిటివ్‌ టాక్‌ వచ్చినా.. అభిమానుల మాత్రం తమ హీరో గ్రేట్ అంటే తమ హీరో గ్రేట్‌ అంటూ దాడులకు తెగబడుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!