Homeతెలుగు Newsమంచు బ్రదర్స్ మధ్య అసలేం జరిగింది ?.. మధ్యలో సారథి ఎవరు ?

మంచు బ్రదర్స్ మధ్య అసలేం జరిగింది ?.. మధ్యలో సారథి ఎవరు ?

what happened between the manchu brothers

సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య వివాదం రచ్చకెక్కింది. తన మనిషి సారథిని తన అన్నయ్య విష్ణు కొడుతున్నారంటూ ఫేస్ బుక్ స్టేటస్ లో మంచు మనోజ్ వీడియోని షేర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇళ్లలోకి వెళ్లి విష్ణు ఇలా కొడుతూ ఉంటాడని మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అన్నదమ్ముల సవాల్ వీడియో హల్​చల్​ చేస్తోంది. మరోపక్క మంచు బ్రదర్స్ గొడవపై మోహన్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా మనోజ్ సోషల్ మీడియాలో వీడియో పెట్టడంపై మోహన్‌బాబు సీరియస్ అయ్యారని సమాచారం.

కాగా, సారథి ఇంట్లో ఏం జరిగిందంటూ మోహన్‌బాబు ఆరా తీసి.. ఫేస్‌ బుక్‌ లో వీడియో తొలగించాలని మనోజ్‌ను ఆదేశించాడు. దీంతో గొడవకు సంబంధించిన వీడియోను మనోజ్ వెంటనే తొలగించారు. ఇంతకీ ఈ సారథి ఎవరు ?, ఈ వ్యక్తి కోసం మంచు విష్ణు – మనోజ్ ఎందుకు గొడవ పడుతున్నారు ?, నిజానికి సారథి మోహన్ బాబుకు దూరపు చుట్టం. అయితే, విష్ణు ఫిల్మ్ కెరీర్ ప్రారంభం నుంచి సారథి విష్ణు వెన్నంటే ఉన్నాడు. కానీ, విష్ణు సినిమాలు వరుసగా ప్లాప్ కావడంతో.. ఇటీవల మనోజ్‌కు సారథి దగ్గరయ్యారు.

విష్ణుకి ఎంతో నమ్మకంగా పని చేసి.. సడెన్ గా విష్ణు దగ్గర నుంచి మనోజ్ దగ్గరకు వెళ్ళడంతో అది విష్ణుకు నచ్చలేదు. అలాగే మంచు ఫ్యామిలీలోని ఆస్తుల పంపకాల విషయంలో కూడా మనోజ్ కి సారథి కొన్ని సలహాలు ఇస్తున్నాడట. ఆ సలహాలు విష్ణుకి వ్యతిరేకంగా అని టాక్. ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు ఇంటికి వచ్చి కొడతా అని సారథికి ఫోన్ చేసి మరీ.. ఇంటికి వచ్చి దాడి చేశాడు. విష్ణు సారథి పైకి వస్తున్నాడు అని తెలుసుకున్న మనోజ్ వెంటనే సారథి ఇంటికి వెళ్ళాడు.

ఆ సమయంలో జరిగిన గొడవను వీడియోగా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తనకు మనోజ్ కి మధ్య విబేధాలకు కారణమవుతున్నాడని.. సారథి ఇంటికి వెళ్లి విష్ణు దాడి చేశాడు. కానీ, ఆ విభేదాల పరిష్కారం కోసం మంచు విష్ణు మరోలా ప్రయత్నం చేయాల్సింది. నిజానికి ఆస్తుల పంపకాల్లో మంచు మనోజ్ కి అన్యాయం జరిగింది. దీనికితోడు మోహన్ బాబు వ్యాపారాలు అన్నీ ప్రస్తుతం విష్ణునే చూసుకుంటున్నాడు. అందులో వచ్చే లాభాలు అన్నీ విష్ణు పర్సనల్ ఎకౌంట్ లోకే వెళ్లిపోతున్నాయి.

ఈ క్రమంలో మంచు మనోజ్ తన కొత్త సినిమా నిర్మాణానికి మోహన్ బాబును ఆర్థిక సహాయం అడిగాడు. కానీ, మంచు విష్ణునే మనోజ్ కి ఆర్థిక సహాయం అందకుండా అడ్డు పడుతున్నాడు. మొత్తానికి ఆస్తుల పంపకాల విషయంలో మొదలైన మనస్పర్థలు.. ఇప్పుడు ఇలా ఇంటికి వెళ్లి దాడులు చేసుకునే వరకూ వెళ్ళడం నిజంగా బాధాకరమైన విషయం. ఒకరకంగా ఈ సంఘటన మోహన్ బాబుకు తీవ్ర అవమానమే.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!