HomeTelugu Trendingచిరు, బాలయ్యల చర్చ దేనికోసం.. ఫొటో వైరల్‌

చిరు, బాలయ్యల చర్చ దేనికోసం.. ఫొటో వైరల్‌

12 5
టాలీవుడ్‌ ప్రముఖ నటులు మెగాస్టార్ చిరంజీవి, నటసింహా నందమూరి బాలకృష్ణ ఓ వేడుకలో కలిశారు. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె వివాహ వేడుకలో చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ కలిశారు. ఈ హీరోలు ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. వారిద్దరూ కలసి సీరియస్‌గా చర్చించుకున్న విషయం ఈ ఫొటోను చూస్తే తెలుస్తోంది. అటు చిరంజీవి ముఖంలో కానీ, ఇటు బాలయ్య ముఖం చూసి ఏదో తీక్షణమైన అంశంపై చర్చ జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వారిద్దరూ ఏం చర్చించుకున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది.

చిరంజీవి హీరోగా నటించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా ద్వారానే కోడి రామకృష్ణ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా అప్పట్లో సంవత్సరం రోజులు ఆడింది. ఆ తర్వాత వారిద్దరి కాంబినేషన్‌లో ఆలయ శిఖరం, గూఢచారి నెం1, సింహపురి సింహం, రిక్షావోడు, అంజి సినిమాలు వచ్చాయి.

అటు బాలకృష్ణకు కూడా కోడి రామకృష్ణ హిట్ సినిమాలు అందించారు. అందులో మంగమ్మగారి మనవడు కూడా ఒకటి. బాలయ్య హీరోగా, కోడి రామకృష్ణ దర్శకత్వంలో ముద్దుల కృష్ణయ్య, మువ్వ గోపాలుడు, భారతంలో బాలచంద్రుడు, ముద్దుల మామయ్య, బాల గోపాలుడు, ముద్దుల మేనల్లుడు వంటి సినిమాలు వచ్చాయి. సుమారు వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన కోడిరామకృష్ణ 2019 ఫిబ్రవరి 22న మృతి చెందారు. కోడి రామకృష్ణతో వారిద్దరికీ ఉన్న అనుబంధం దృష్ట్యా ఆయన కుమార్తె పెళ్లి వేడుకకు హాజరయ్యారు మన హీరోలు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!