HomeTelugu Trendingపెళ్ళయిందని మర్చిపోయిన దీపిక.. వీడియో వైరల్‌

పెళ్ళయిందని మర్చిపోయిన దీపిక.. వీడియో వైరల్‌

6 16బాలీవుడ్‌ హీరో, హీరోయిన్‌లు దీపిక పదుకొణె, రణ్‌వీర్ సింగ్‌లు ఈమధ్యే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే తనకి పెళ్ళయిందన్న విషయాన్ని దీపిక మర్చిపోయారు. వివరాల్లో కెళితే.. దీపిక ‘లివ్ లవ్ లాఫ్’ అనే ఫౌండేషన్‌ను స్థాపించిన సంగతి తెలిసిందే. డిప్రెషన్ బాధితుల కోసం దీపిక దీనిని ప్రారంభించారు. తాజాగా ఈ ఫౌండేషన్ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో దీపిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. ‘నేను ఒకరికి కూతురిని, సోదరిని, నటిని..’ అని చెప్పి ఊరుకున్నారు. ఇంతలో పక్కనే ఉన్న వారు ఒక ‘భార్య’ అని అందించారు.

ఇందుకు దీపిక ‘అవును భార్యను.. ఓ మై గాడ్ నేను ఒకరి భార్యను అన్న విషయాన్నే మర్చిపోయానని అనడం అక్కడున్న వారిని ఆశ్చర్యనికి గురిచేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీపిక పదుకొణె, రణ్‌వీర్ సింగ్ లు ప్రస్తుతం ’83’ సినిమాలో రీల్ లైఫ్ భార్యాభర్తల పాత్రల్లో నటిస్తున్నారు.1983 కపిల్ దేవ్ సారథ్యంలో టీమిండియా ప్రపంచకప్‌ను ఎలాసాధించింది అన్న నేపథ్యంలో ఈ సినిమాను కబీర్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో రణ్‌వీర్ కపిల్ పాత్రలో నటిస్తున్నారు. దీపిక కపిల్ భార్య రోమీ దేవ్ పాత్రను పోషిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!