కల్యాణ్‌దేవ్ ‘విజేత’ టీజర్ విడుదల

చిరంజీవి అల్లుడు కల్యాణ్‌దేవ్ హీరోగా వస్తున్న తొలి చిత్రం ‘విజేత’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. అప్పటి విజేత చిత్రం చిరంజీవికి ఎంతటి పేరు తెచ్చిపెట్టిందో తెలిసిందే. అదే టైటిల్‌ విజేతతో మెగా అల్లుడు కల్యాణ్‌దేవ్‌ డిబట్ మూవీతో విజయం సాధించాలని మన ముందుకొస్తున్నాడు.

కొడుకు ప్రయోజకుడు కావాలనుకునే తండ్రి.. అతడి మాటలు పట్టించుకోకుండా ఆవారాగా తిరిగే కొడుకు.. వీరిద్ధరి మధ్య జరిగే కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తనకు నచ్చినట్టుగా ఉండే హీరో చివరికి ఎలా విజేత అయ్యాడన్నది చిత్ర కథాంశం. ఇందులో కల్యాణ్‌దేవ్‌ తండ్రిగా మురళీశర్మ నటిస్తున్నారు. రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కల్యాణ్‌దేవ్‌ సరసన మాళవికా నాయర్ జోడీగా నటిస్తోంది. రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంగీతం హర్షవర్ధన్ అందిస్తున్నారు.