ప్రియా వారియర్‌కు బంపర్‌ ఆఫర్‌ కోటి రూపాయలు

“ఒరు అదార్‌ లవ్” సినిమాలోని ఓ పాటలో మలయాళ నటి ప్రియావారియర్ కన్నుకొట్టి తాను పలికించిన హావభావాలు యూట్యూబ్ వైరల్‌ కావడంతో ఒక్కసారిగా కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేసింది. ఆవీడియోకు 50 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. కొన్ని రోజుల క్రితం వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌.. ఇలా సోషల్‌ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ఎక్కడ చూసినా ఆమే కనిపించేది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. తాజాగా ఓ వాణిజ్య ప్రకటనలో నటించేందుకు ఆమెకు ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న “సింహా” సినిమాలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

మలయాళ నటి ప్రియా వారియర్‌ తాజాగా ఓ వాణిజ్య ప్రకటనలో నటించేందుకు ఓ ప్రముఖ సంస్థతో భారీ డీల్‌ కుదుర్చుకున్నట్లు సమాచారం. దీనికోసం రూ. కోటి ఆఫర్ చేసినట్లు అందుకు ఆమె అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ఆ ప్రకటనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జాతీయ ప్రకటన అని చెబుతున్నారు. ఓ నూతన నటికి ఇంత పెద్ద పారితోషికం చాలా ఎక్కువనీ తెలుస్తోంది. ప్రియావారియర్‌కు ట్విట్టర్ ఫాలోవర్స్ 62 లక్షల మంది ఉన్నారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి ఏదైనా ప్రకటన చేయాలంటే రూ. 8 లక్షలు తీసుకుంటున్నారట.