విష్ణు మంచు హీరోగా ఎం.వి.వి. సినిమా బ్యాన‌ర్‌పై రూపొందనున్న చిత్రం `ల‌క్కున్నోడు`

విష్ణు మంచు హీరోగా ఎం.వి.వి. సినిమా బ్యాన‌ర్‌పై రూపొందనున్న చిత్రం `ల‌క్కున్నోడు`
`ఈడోరకం-ఆడోరకం` వంటి సూప‌ర్‌హిట్ చిత్రం తర్వాత విష్ణు మంచు హీరోగా ఎం.వి.వి.సినిమా బ్యాన‌ర్‌పై గీతాంజ‌లి, త్రిపుర వంటి హ‌ర్ర‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు రాజ్ కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌గా `లక్కున్నోడు` చిత్రం ప్రారంభం కానుంది. ఈ సంద‌ర్భంగా..
చిత్ర నిర్మాత ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ “డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల్లో న‌టిస్తున్న విష్ణు మంచు హీరోగా మా బ్యాన‌ర్లో సినిమా చేయ‌నుండ‌టం చాలా హ్యాపీగా ఉంది. ఈడోరకం -ఆడోర‌కం వంటి సూప‌ర్‌హిట్ చిత్రం త‌ర్వాత ఆయ‌న చేస్తున్నల‌వ్ అండ్ కామెడి ఎంట‌ర్‌టైనర్ `ల‌క్కున్నోడు`. గీతాంజ‌లి, త్రిపుర వంటి హ‌ర్ర‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ తో స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుక‌న్న రాజ్‌కిర‌ణ్‌ ఈసారి వాటికి భిన్నంగా లవ్ అండ్ కామెడి ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాన్ని రూపొందించ‌నున్నారు. ఆయ‌న చెప్పిన పాయింట్ విన‌గానే మంచు విష్ణు సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఈ సినిమాకు రైటర్ డైమండ్ ర‌త్నంబాబు ర‌చ‌న‌, క‌థా విస్త‌ర‌ణ‌, మాట‌లు అందిస్తున్నారు. సాయిశ్రీరాం సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మ‌ధు ఎడిటింగ్ వ‌ర్క్ చేస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ రెండ‌వ వారం త‌ర్వాత సెట్స్‌ లోకి వెళుతుంది. త్వ‌ర‌లోనే మిగ‌తా న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ వివ‌రాల‌ను తెలియ‌జేస్తామన్నారు.  
ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌లుః వి.ఎస్‌.ఎన్‌.కుమార్‌, విజ‌య్‌కుమార్ రెడ్డి, నిర్మాతః ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌, క‌థ, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: రాజ్‌కిర‌ణ్‌.
CLICK HERE!! For the aha Latest Updates