HomeTelugu Big Storiesఅభిమానులకు హరికృష్ణ చివరి లేఖ

అభిమానులకు హరికృష్ణ చివరి లేఖ

ప్రముఖ సినియర్‌ నటుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ (61) మరణం ఎన్టీఆర్‌ కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నల్గొండ సమీపంలోని అన్నేపర్తి వద్ద హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడడంతో తీవ్ర గాయాలపాలైన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా, సెప్టెంబరు 2న అంటే మరో నాలుగు రోజుల్లో హరికృష్ణ పుట్టినరోజు రానుంది. ఈ నేపథ్యంలో హరికృష్ణ అభిమానులను ఉద్దేశించి ఆయన ఇటీవల ఓ లేఖ రాశారు.

5 31

‘సెప్టెంబరు 2న అరవై రెండో పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి వేడుకలు జరపవద్దని నా మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, కేరళ రాష్ట్రంలో వరదలు, వర్షాలు కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది నిరాశ్రయులైనారు. ఇది మన అందరికీ ఎంతో విషాదాన్ని కలిగించే విషయం. అందువల్ల నా జన్మదినం సందర్భంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, పుష్ప గుచ్ఛాలు, దండలు తీసుకురావద్దని వాటికి అయ్యే ఖర్చును వరదలు, వర్షాలు కారణంగా నష్టపోయిన కుటుంబాలకు అందజేయాలని కోరుతున్నాను. అంతేకాకుండా, నిరాశ్రయులైన వారికి దుస్తులు, వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులు మీ శక్తి మేరకు అందజేయాలని కోరుతున్నాను.. ఇట్లు- మీ నందమూరి హరిక‌ృష్ణ’ అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!