HomeTelugu Big Storiesనాలుగో అంతర్జాతీయ యోగా దినోత్సవం

నాలుగో అంతర్జాతీయ యోగా దినోత్సవం

ఈరోజుల్లో యోగా ప్రాముఖ్యతను అందరూ గుర్తించారు. ఇప్పుడు ఫిట్‌ నెస్ కోసం యోగాను అనుసరిస్తున్నారు. సినీ తారలది ఎంతో బిజీ లైఫ్. అయినా గానీ కొంత సమయాన్ని యోగా కోసం కేటాయిస్తున్నారు కొందరు తారలు. సినిమా తారల విషయంలో ఎంత బిజీగా ఉన్నా మైండ్‌ మరియు బాడీ కూడా అంత ఫ్రెష్‌గా ఉండాలి. సినిమా ఫీల్డ్‌ అలాంటిది. అందుకే కాజల్, రాశిఖన్నా, ఆదాశర్మ, సంజన.. తమ డైలీ లైఫ్‌లో యోగాకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ముందు యోగా. ఆ తర్వాతే మిగతా షెడ్యూల్స్‌ అంటున్నారు.

1 17

యోగా నా జీవితంలో భాగమైపోయింది ‌: కాజల్‌
కాలేజ్‌లోనే నాకు ఫిట్‌నెస్‌ మీద అవగాహన ఏర్పడింది. ఫస్ట్‌ నేను ఏరోబిక్స్‌ క్లాస్‌లో జాయిన్‌ అయ్యాను. తర్వాత జిమ్‌కు వెళ్లటం మొదలుపెట్టాను. ఓసారి యోగా ట్రై చేశాను. బాగా అనిపించింది అప్పటినుంచి యోగా నా జీవితంలో భాగమైపోయింది. బేసిక్‌గా నేను ఫుడ్‌ లవర్‌ని. ఎంత ఇష్టంగా తింటానో ఫిట్‌నెస్‌ కోసం అంతే ఇష్టంగా యోగా చేస్తాను. యోగా చేస్తే చాలు.. కేలరీలు ఇట్టే కరిగిపోతాయి. యోగా చేయడానికి ఎక్విప్‌మెంట్స్‌ కూడా అవసరంలేదు. మనకు కావాల్సింది జస్ట్‌ ఒక్క యోగా మ్యాట్‌ మాత్రమే. నేను ఎక్కడికెళ్లినా నాతో పాటు యోగా మ్యాట్‌ని కంపల్సరీ తీసుకెళతాను. సో.. నో బ్రేక్‌ ఫర్‌ యోగా. వారానికి మూడు రోజుల చొప్పున రోజుకు గంటన్నర తప్పనిసరిగా యోగా చేస్తాను. వారంలో మరో మూడు రోజులు వెయిట్‌ బ్యాలెన్స్‌ ట్రైనింగ్‌ చేస్తాను. సూర్య నమస్కారాలు బెస్ట్‌. నేను రోజూ ఏ ఆసనం వేసినా వేయకపోయినా సూర్య నమస్కారాలు మాత్రం తప్పనిసరిగా చేస్తాను. 150 సూర్య నమస్కారాలు ఖచ్చితంగా చేస్తాను. నా ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌లో యోగాకి మొదటి స్థానం‌.

యోగా గొప్పదనం అప్పుడే తెలుసుకున్నా: రాశీ ఖన్నా
యోగా గొప్పదనం గురించి నా టీనేజ్‌లోనే తెలుసుకున్నా. నేను యోగా చేయడం మొదలుపెట్టినప్పుడు నా వయసు పదహారేళ్లు. అప్పటినుంచి యోగా చేస్తూనే ఉన్నా. యోగా వల్ల చాలా ఉపయోగాలున్నాయి. మనసు, శరీరం రెండిటికీ మంచిది. నిజానికి యోగా అంటే బరువు తగ్గడానికి అని చాలామంది అనుకుంటారు. అయితే అది మానసిక స్థితి కూడా బాగుంటుంది. ప్రశాంతత దొరుకుతుంది. సూర్య నమస్కారాలు నా ఫేవరెట్‌ ఆసనం. ఈ ఆసనంతో శరీరంలోని అన్ని కండరాల్లో కదలిక వస్తుంది. యోగా వల్ల పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ వస్తుంటాయి. అందువల్ల చిన్న చిన్న సంఘటనలు మనల్ని నిరుత్సాహ పరచలేవు. మధ్య నేను కొంత బరువు తగ్గాను. దానికి ముఖ్య కారణం యోగా. ఆ టైమ్‌లో వాకింగ్‌ కూడా బాగా చేశాను. నాది ఉదయం 9 గంటలకు వెళ్లి సాయంత్రం 5 గంటలకు వచ్చే జాబ్‌ కాదు. కొన్నిసార్లు రోజుకి 12, 13 గంటలు షూటింగ్‌ చేస్తుంటాను. అప్పుడు కూడా నాకు అలసట అనిపించదు. దానికి ఒక కారణం యోగా. ఉదయం ఓ గంట సేను చేసే యోగా రోజంతా కావల్సిన శక్తిని ఇస్తుంది.

నా గురువు మా అమ్మగారే: అదాశర్మ
మా అమ్మ నాకు యోగాను నేర్పించింది. నా చిన్నప్పుడు మా అమ్మ రోజూ యోగా చేయడం చూశాను. మెల్లగా నాకూ అలవాటు చేశారు. నా యోగా గురువు మా అమ్మే. యోగాతో పాటు నేను వేరే ఎక్సర్‌సైజులు కూడా చేస్తాను. అయితే అవి చేసే ముందు యోగా చేస్తాను. నేను సూర్య నమస్కారాలు బాగా చేస్తాను. మొదట్లో కొంచెం కష్టంగా అనిపించేది. అలవాటైన తర్వాత సూర నమస్కారాలు చేయని రోజున చాలా వెలితిగా ఉంటుంది. యోగాలో మెడిటేషన్‌ ఓ భాగం. ధ్యానం చేసి చూడండి. ఏకాగ్రత పెరుగుతుంది. నేను శాఖాహారిని. అంతకు మించిన ఆరోగ్యవంతమైన ఆహారం లేదని నా అభిప్రాయం. ఎలాంటి పరిస్థితుల్లో అయినా యోగా వల్లే నా మైండ్‌ చాలా బ్యాలెన్డ్స్‌గా ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం యోగా చేయడానికి ప్రయత్నించండి. రోజంతా ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది.

యోగాతో జీవితంలో అద్భుతాలు : మంచు లక్ష్మి
యోగా నా జీవితంలో భాగం అయినప్పటినుండి నా జీవితంపై పూర్తి నియంత్రణ వచ్చింది. రోజూ ఇన్ని పనులు మేనేజ్‌ చేయగలుగుతున్నానంటే దానికి కారణం యోగా మాత్రమే. ఎవరి జీవితంలోకి అయినా యోగాను అనుమతిస్తే వారి జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి. ఆధునిక జీవన విధానంలో యోగా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఒత్తిడితో నిండిన జీవన విధానం, బరువు తగ్గించుకోవడం..వంటి సమస్యలపై పోరాడేందుకు యోగా శక్తి వంతమైన ఆయుధంగా మారింది. అయితే యోగాలు అన్నీ ఒక్కటేనా..? అంటే కచ్చితంగా కాదు. శాస్ర్తీయమైన యోగా కేంద్రాలు అరుదుగా దొరుకుతాయి. యోగాను తమ జీవితంగా మార్చుకున్న ప్రొఫెషనల్‌ ట్రైనర్స్‌ కూడా కొంతమందే ఉంటారు. యోగాను పూర్తిగా అర్థం చేసుకొని దానిని ఫిజికల్‌ ప్లెక్సిబిలిటీ పెంచే సాధనంగా మాత్రమే కాకుండా మానసికమైన ఒత్తిడులను తగ్గించే మంత్రంగా మార్చడానికి శాస్ర్తీయ విధానాలు తెలిసిన వారికే సాధ్యం అవుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu