HomeTelugu News33 కార్లను మటాష్ చేసిన సాహో టీమ్

33 కార్లను మటాష్ చేసిన సాహో టీమ్

దుబాయ్ లోని అత్యంత ఖరీదైన లొకేషన్లలో సాహో సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరిస్తున్నారు. బాహుబలి తర్వాత వస్తున్న ప్రభాస్ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హిందీలో కూడా ఈ సినిమా రూపొందుతోందట. దర్శకుడు సుజిత్, హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ కెన్నిబేట్స్ తో కలిసి దుబాయ్ లో భారీ యాక్షన్, ఛేజింగ్ దృశ్యాల షూటింగ్ జరుపుతున్నారు. దాదాపు 50 నుంచి 60 కోట్ల బడ్జెట్ కేవలం ఈ యాక్షన్ ఎపిసోడ్ కే ఖర్చు చేస్తున్నారట. దుబాయ్ లోని ఫ్లైఓవర్ పై భారీ ట్రక్కులు, కార్లతో సాహో భారీ ఫైట్ చిత్రీకరణ జరిగింది.

4 4

ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం 33 లగ్జరీ కార్లు, 4 భారీ ట్రక్ లు వినియోగించారు. లెక్కకు మించి స్పోర్ట్స్ బైక్ లను వాడారట. ఈ ఫైట్ సీన్ లో అన్నీ స్మాష్ అయ్యాయని కెన్నీబెట్స్ చిత్రీకరించిన ఈ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. డమ్మీ కార్లు కాకుండా ఒరిజినల్ కార్లను వాడటంపైనా ఆసక్తికరంగా మారింది. ఈ ఫైట్ కోసం ప్రభాస్ చాలా రిస్క్ చేశాడని అంటున్నారు. నితిన్ ముఖేష్ ప్రతి కథానాయకుడి పాత్ర చేస్తున్న ఈ చిత్రంలో శ్రద్దాకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!