
Sitaare Zameen Par OTT Rights:
బాలీవుడ్‌లో ‘Mr. Perfectionist’గా పేరున్న Aamir Khan మరోసారి తన భిన్నమైన ఆలోచనలతో వార్తల్లో నిలిచాడు. Taare Zameen Parకి కొనసాగింపుగా వస్తున్న Sitaare Zameen Par సినిమాను జూన్ 20, 2025న థియేటర్లలో విడుదల చేయనున్నాడు. ఈ సినిమాలో Genelia Deshmukh కూడా కీలక పాత్రలో నటిస్తోంది.
అయితే ఈ సినిమా కన్నా సినిమా బిజినెస్ ఎక్కువగా ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అమీర్ ఖాన్ కి ఓ ప్రముఖ OTT సంస్థ రూ.100 కోట్లు ఆఫర్ చేసి, సినిమా స్ట్రీమింగ్ హక్కులు కొనుగోలు చేయాలనుకుంది. కానీ Aamir Khan నేరుగా ఆ డీల్‌ను తిరస్కరించాడు!
థియేటర్ల మీద నమ్మకంతో
ఆమీర్ తన సినిమాలు ప్రేక్షకులతో థియేటర్లలో కలిసి చూడాలన్న భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. “మనకు థియేటర్ అనుభవం కోల్పోకుండా ఉండాలి” అనే అభిప్రాయంతో ఆయన OTT కంటే థియేటర్ మార్గాన్ని ఎంచుకున్నాడు.
సినిమా విడుదలయ్యాక 8 వారాల తర్వాత YouTube Pay-Per-View ద్వారా సినిమాను ఆన్‌లైన్‌లో చూడవచ్చు. ఈ విధానం కింద ప్రేక్షకులు ఓసారి డబ్బు చెల్లిస్తే, అప్పుడే సినిమా చూడొచ్చు – సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదు. ఇది భారత్‌లో ఓ పెద్ద బడ్జెట్ సినిమా ఇలా విడుదల కావడం ఇదే తొలిసారి.
చిన్న నిర్మాతలకు స్ఫూర్తిగా
ఈ విధానం ద్వారా Aamir సినిమాపై పూర్తి హక్కులు తన చేతుల్లోనే ఉంచుకున్నారు. ఇకపై చిన్న సినిమాల నిర్మాతలు కూడా YouTube వంటి ప్లాట్‌ఫాంలను వినియోగించుకునే అవకాశాన్ని ఈ నిర్ణయం తెరిచే అవకాశం ఉంది.
ALSO READ: Akshay Kumar Paresh Rawal వివాదం గురించి చేసిన షాకింగ్ కామెంట్స్!