
Aamir Khan Shah Rukh Khan friendship:
బాలీవుడ్‌లో చాలా మంది ఫ్యాన్స్ షారుక్ ఖాన్ (SRK) – ఆమిర్ ఖాన్ మధ్య పోటీ ఉందని భావిస్తుంటారు. కానీ ఆమిర్ మాత్రం ఓ తాజా ఇంటర్వ్యూలో అందుకు పూర్తి విరుద్ధంగా స్పందించారు. షారుక్ తాను ఎప్పుడు మంచి స్నేహితుడిగానే ఉన్నాడని చెప్పారు.
ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ, “ఒకసారి షారుక్ తనకోసమూ, నాకోసమూ ఒకే ల్యాప్‌టాప్ రెండు కొనుగోలు చేశాడు. నా ల్యాప్‌టాప్‌లో కావాల్సినవన్నీ సెట్ చేసి గిఫ్ట్ ఇచ్చాడు. అది ఎంత స్పెషల్ గిఫ్ట్ అంటారు. కానీ అది నేను పూర్తిగా మర్చిపోయాను! నాలుగు సంవత్సరాల తర్వాత నా మేనేజర్ అడిగాడు – ‘ఇది వాడొచ్చా?’ అని.. అప్పుడే గుర్తొచ్చింది. కానీ ఆ ల్యాప్‌టాప్ ఆన్ కూడా కాలేదు,” అని చెప్పుకొచ్చారు.
ఇంతవరకు ఈ ఇద్దరు స్టార్ హీరోలు వేరే వేరే మార్గాల్లో ఉన్నా – మిగతా విషయాల్లో పరస్పర గౌరవంతో మెలిగారని ఆమిర్ వెల్లడించారు. “మేమంతా 90ల తరం హీరోలు. షారుక్ చేసిన డీడీఎల్జే (DDLJ) నాకు చాలా నచ్చింది. అసూయే లేదు. మేమిద్దరం బేబీ స్టెప్స్ తీసుకుంటున్నప్పుడు, ఒకరికొకరు ప్రోత్సాహం ఇచ్చుకున్నాం,” అంటూ అన్నాడు.
ఈ కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ అభిమానుల్లో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. నిజంగా ఈ ఇద్దరూ ఒక్కసారైనా స్క్రీన్ పై కలిసెస్తే ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు!
ALSO READ: IPL 2025 Final: RCB ప్లేయర్ల నెట్ వర్త్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..