HomeTelugu Trendingసినిమాపై కామెంట్‌.. దిమ్మతిరిగే రిఫ్లై ఇచ్చిన నందు

సినిమాపై కామెంట్‌.. దిమ్మతిరిగే రిఫ్లై ఇచ్చిన నందు

Actor nandu given mind blowటాలీవుడ్‌ హీరో, సింగర్‌ గీతా మాధరి భర్త నందు నటిస్తున్న తాజా చిత్రం ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు విరాఠ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నిన్న నందు పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో జమీందార్ లా ఒళ్లంతా బంగారు ఆభరణాలు ఖరీదైన కాస్ట్యూమ్ తో కనిపిస్తున్నాడు. అయితే ఆ పోస్టర్ ను నందు కూడా తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దానికి ఓ వ్యక్తి.. ”సినిమా డైరెక్ట్ గా విడుదల చెయ్.. చూసి చస్తాం… ఏదో పెద్ద సూపర్ స్టార్ ల అప్డేట్ పోస్ట్ ఎందు, టైం బొక్క” అని కామెంట్ పెట్టాడు. ఇది చూసిన నందు అతనికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. ఆ కామెంట్ పై నందు స్పందిస్తూ…” మళ్ళీ నీలాంటోడే వచ్చి నెపోటిజం, తొక్క బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వారికి సప్పోర్ట్ చేయాలి అని పోస్ట్ లు పెడుతుంటాడు. సూసైడ్ చేసుకుంటే తప్ప బ్యాగ్రౌండ్ లేనివాడికి సపోర్ట్ చేయని మీలాంటి బ్యాచ్ కు దండం. అయిన నేను స్టార్ అన్ని ఎప్పుడు చెప్పుకోలేదు. నువ్వే ఇండైరెక్ట్ గా తలిగిస్తున్నావ్” అని అన్నాడు. ప్రస్తుతం ఈ కామెంట్ వైరల్ గా మారింది. ఇక బాలీవుడ్ లో సుశాంత్ ఆత్మహత్య తరువాత నెపోటిజం పై పెద్ద వివాదం చేలరేగిన విషయం తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!