HomeTelugu Trendingపల్లవితో హీరో నిఖిల్‌ నిశ్చితార్థం

పల్లవితో హీరో నిఖిల్‌ నిశ్చితార్థం

8 1
యంగ్ హీరో నిఖిల్‌కు నిశ్చితార్థం ఘనంగా జరిగింది. డాక్టర్‌ పల్లవి వర్మతో ఆయనకు నిశ్చితార్థం అయినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇరువురు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా, ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకరించడంతో తాజాగా వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. నిఖిల్‌-పల్లవి కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. నిఖిల్‌ అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

గతంలో మంచులక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరించిన తెలుగు రియాల్టీ షో ‘ఫీట్‌ అప్‌ విత్‌ స్టార్స్‌’లో తన ప్రేమ గురించి నిఖిల్‌ తొలిసారి వెల్లడించారు. ”నా జీవితంలో ఆ అమ్మాయి చాలా స్పెషల్‌. తను ఒక డాక్టర్‌. తను నన్ను బాగా అర్థం చేసుకుంది. నేను సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పుడు కానీ, స్నేహితులతో సరదాగా గడుపుతున్నప్పుడు కానీ తను నన్ను విసిగించదు. నా ఫోన్‌ కూడా చెక్‌ చేయదు. ‘నువ్వు ఎప్పుడు సరదాగా గడపాలి అనుకుంటే అప్పుడు గడుపు’ అని తను నాతో చెప్పింది. ప్రతిఒక్కరికి ఒక వ్యక్తిగత జీవితం ఉంటుంది అనే విషయాన్ని తను నమ్ముతుంది. అదే నాకు తనలో బాగా నచ్చింది” అని నిఖిల్‌ తెలిపారు. గతేడాది ‘అర్జున్‌ సురవరం’తో ఘన విజయాన్ని అందుకున్నాడు ఈ హీరో‌. కెరీర్‌లో విభిన్న కథలను ఎంచుకోవడమే కాకుండా, తనదైన డైలాగ్‌ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

8a

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!