జాన్వీ ‘గుంజన్ సక్సేనా’ ది కార్గిల్ గర్ల్ ట్రైలర్‌

కార్గిల్ యుద్ధంలో విమానం నడిపిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన గుంజన్ సక్సేనా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్. ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ గుంజన్‌ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమాలో విమానం నడపాలి అనే ఆసక్తి ఉన్న అమ్మాయిని సమాజం ఎలా నిరుత్సాహాపరుస్తుంది. వాటిని అధిగమించి ఆమె ఎలా తన కలని నెరవేర్చుకుంటుంది అనేది చాలా అద్భుతంగా చూపించారు.

పంకజ్ త్రిపాఠి ఈ చిత్రంలో జాన్వి తండ్రిగా నటించారు. కూతురును వెన్నుతట్టి ప్రోత్సహించే తండ్రిగా ఆయన ఈ సినిమాలోనటించారు. ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టులో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ చేయనున్నారు. శరణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంగద్ బేడి, వినీత్ కుమార్, మానవ్ విజ్ , అయేషా రాజ్ కూడా కీలక పాత్రల్లో నటించారు.

CLICK HERE!! For the aha Latest Updates