ర‌కుల్ సినిమాలో యంగ్‌ హీరోయిన్‌!

బాలీవుడ్ హీరో అర్జున్‌కపూర్‌ కు జంటగా నటిస్తుంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. కాష్వీ నాయర్‌ ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. భూషణ్‌ కుమార్, నిఖిల్‌ అద్వానీ, జాన్‌ అబ్రహాం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మరో యంగ్ హీరోయిన్‌ కూడా నటిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్‌తోపాటు అదితీ రావు హైదరి కీలకపాత్రలో నటిస్తోందట. ఈ ప్రాజెక్టులో జాన్ అబ్రహాం కూడా మరో కీలక పాత్రలో కనిపించనుండగా.. అతనికి జోడీగా అదితీ రావు హైదరి అయితే బాగుంటుందని చిత్ర బృందం భావిస్తోందట. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. దీపికా ప‌దుకొనే న‌టించిన ‘ప‌ద్మావ‌త్’ త‌ర్వాత మ‌రే హిందీ చిత్రంలో క‌నిపించ‌లేదు అదితీ రావు హైద‌రి.

CLICK HERE!! For the aha Latest Updates