రాజ్‌తరుణ్‌తో బాలీవుడ్‌ భామ?

యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌కు జోడీగా బాలీవుడ్‌ భామ అదితిరావు హైదరి సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఆమె హైదరాబాద్‌కు చెందిన వారే అయినా.. బాలీవుడ్‌లో కెరీర్‌ ప్రారంభించారు. ‘చెలియా’, ‘సమ్మోహనం’, ‘నవాబు’, చిత్రాలతో మంచి గుర్తింపు లభించింది. తర్వాత ‘అంతరిక్షం’లో కనిపించారు. ప్రస్తుతం ‘వి’ చిత్రంలో హీరోయిన్‌ పాత్ర పోషిస్తున్నారు.

కాగా అదితి తెలుగులో కొత్త ప్రాజెక్టుకు సంతకం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. రాజ్‌తరుణ్‌ హీరోగా ‘గుండెజారి గల్లంతయ్యిందే’ దర్శకుడు విజయ్‌ కుమార్‌ ఓ సినిమాను తెరకెక్కించనున్నారట. ఇందులో హీరోయిన్‌ పాత్ర కోసం దర్శక, నిర్మాతలు అదితిని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచిచూడాల్సిందే.