200 లొకేషన్స్ లో సినిమా చేశాం!

తమిళ స్టార్ హీరో సూర్య నటించే ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. తెలుగులో కూడా ఆయన అభిమానుల సంఖ్య తక్కువేమీ కాదు.. ప్రస్తుతం ఆయన నటించిన సింగం 3 సినిమా ఫిబ్రవరి 9న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సంధర్భంగా.. సూర్యతో కాసిన్ని
ముచ్చట్లు..

కంటెంట్ ముఖ్యం..
ఈ సినిమా కావాలని మేము పోస్ట్ పోన్ చేయలేదు. కొన్ని అనుకోని సంఘటనల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. కంటెంట్ ఉంటే సినిమా ఎప్పుడు రిలీజ్ చేసిన ప్రేక్షకులు చూస్తారు. వారు కూడా మా సినిమా పట్ల ఎంతో సహనంగా ఉంటూ ఎదురుచూస్తున్నారు.

నా సినిమా లేకపోయినా.. సపోర్ట్ చేస్తా..
నా వంతు బాధ్యతగా నేను జల్లికట్టుకి సపోర్ట్ చేశాను. కానీ చాలా మంది నేను నా సినిమా కోసం ప్రమోషన్స్ చేసుకుంటున్నానని అన్నారు. నా సినిమా ఉన్నా.. లేకపోయినా.. నేను ఖచ్చితంగా సపోర్ట్ చేసే తీరతాను.

ఆయన నుండి స్పూర్తి పొందాము..
ఏ.డి.ఎస్.పి.ఆనంద్ గారు 22 ఏళ్ల వయసులో పోలీస్ ఆఫీసర్ గా చేరారు. ప్రెసిడెంట్ అవార్డ్ కూడా తీసుకున్నారు. ఆయన లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల స్ఫూర్తిగా హరి గారు ఈ కథ రాసుకున్నారు.

ఏది ప్లాన్ చేయలేదు..
నిజం చెప్పాలంటే యముడు సినిమా చేసేప్పుడు దానికి సిరీస్ గా మరో సినిమా చేస్తామనుకోలేదు. సింగం 2 చేసినప్పుడు సింగం 3 ఉంటుందని అనుకోలేదు. ఏది ప్లాన్ చేసి చేయలేదు. ఈ ఫ్రాంచైజీ ఎన్ని సినిమాలు వస్తాయో చెప్పలేను.

గడ్డం లుక్ కావాలనే..
తమిళనాడుకి సౌత్ లో కొన్ని ప్రాంతాలు ఉంటాయి. అక్కడ బస్ డ్రైవర్స్ నుండి పాలు అమ్మే వారి వరకు గడ్డం లుక్ ఇలానే ఉంటుంది. నేను చేసిన యముడు సినిమా గనుక తీసుకుంటే అందులో నేను రూరల్ ఏరియాకు చెందిన పోలీస్ గానే కనిపిస్తాను. అక్కడ నుండి ఇంక ఇదే లుక్ ను మైంటైన్ చేయాలనుకున్నాం.

హరి గారు సిన్సియర్ పర్సన్..
హరి గారు సిన్సియర్, డౌన్ టు ఎర్త్ పెర్సన్. సాధారణంగా ఓ రోజులో ముప్పై షాట్స్ వరకు తీయొచ్చు కానీ హరి గారు తొంబై షాట్స్ తీయగలరు. మూడు సినిమాలకు చేసినంత వర్క్ ఈ సినిమాకు చేశారు. అయినా.. 120 రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేశారు. 200 లొకేషన్స్ ఓ సినిమాను చిత్రీకరించారు.

ఖాళీగా ఉంటే దోశ వేశా..
నేనెప్పుడు ఖాళీగా ఉన్నా.. ఏదొక వంట చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఆమ్లెట్ కానీ, దోశ కానీ ఇలా ఏదొకటి.

నేనెప్పుడు సిద్ధమే..
తెలుగులో స్ట్రెయిట్ సినిమా నేను ఎప్పుడు సిద్ధమే.. ఆ ప్రశ్న ఇక్కడ దర్శకులను అడగాలి.

జ్యోతికతో సినిమా చేస్తా..
గతేడాది చేయాల్సివుంది కానీ జరగలేదు. తను మళ్ళీ సినిమాలకు గుడ్ బై చెప్పే లోపు ఖచ్చితంగా సినిమా చేస్తాను.

విజ్ఞేష్ తో సినిమా చేస్తున్నా…
నాకు విజ్ఞేష్ డైలాగ్స్ బాగా నచ్చాయి. సినిమా ప్రాసెస్ లోనే ఉంది.