పోర్చుగల్‌ వెళ్లిన అక్కినేని ఫ్యామిలీ

గ్లోబలైజేషన్ తరువాత మన తెలుగు సినిమాలు ఎక్కువగా విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్నాయి. యూరప్ దేశాల్లో షూటింగ్ జరుపుకోవడం కామన్ గా మారిపోయింది. ప్రస్తుతం నాగార్జున హీరోగా నటిస్తున్న మన్మథుడు 2 సినిమా షూటింగ్ పోర్చుగల్ లో జరుగుతున్నది. దీనికోసం అక్కినేని ఫ్యామిలీ అక్కడికి వెళ్లింది. అక్కినేని నాగార్జున, అమల, కోడలు సమంత కూడా పోర్చుగల్‌లో ఉన్నారు. మన్మథుడు 2 లో సమంత ఓ కీలక పాత్ర చేస్తోంది. ఆ పాత్ర ఏమిటనేది వివరాలు తెలియాల్సి ఉంది.

మజిలీ హిట్ తరువాత సమంత చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై క్రేజ్ పెరిగింది. తమిళంలో సూపర్ హిట్టైన 96 మూవీలో కూడా సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. పోర్చుగల్ నుంచి తిరిగి వచ్చిన తరువాత సమంత ‘ఓ బేబీ’ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుందట. అక్కినేని అమల రీసెంట్ గా పోర్చుగల్ వెళ్లి భర్త నాగార్జునతో జాయిన్ అయ్యింది. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న సినిమా కావడంతో ఆ సంస్థకు సంబంధించిన వ్యవహారాలు చూసుకోవడానికి వెళ్లినట్టు తెలుస్తోంది.

CLICK HERE!! For the aha Latest Updates