చిరు సినిమాలో అక్షయ్..?

చిరంజీవి 151వ సినిమాగా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కథను ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు సురేందర్ రెడ్డి ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టాడు. వీలైనంత త్వరగా సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ను సంప్రదిస్తున్నట్లు టాక్. అయితే సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉంటుందనే విషయాన్ని సస్పెన్స్ గానే ఉంచారు.

ఇప్పటికే 2.0 సినిమాతో సౌత్ కు పరిచయం కానున్న అక్షయ్ కుమార్ త్వరలోనే గ్రాండ్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే ప్రచారం జోరందుకుంది. 2.0 సినిమాలో అక్షయ్ విలన్ గా నటిస్తున్నాడని తెలియగానే మార్కెట్ వాల్యూ మరింత పెరిగింది. ఇప్పుడు చిరు కూడా అదే రిపీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి దీనికి అక్షయ్ నుండి ఎలాంటి స్పందన వస్తుందో.. చూడాలి!