‘అహం బ్రహ్మాస్మి’ లో అల్లరి నరేశ్‌!


‘అల్లరి’ నరేశ్ కామెడీ హీరోగా పలు సినిమాలను చేశాడు. మహేశ్‌ బాబు ‘మహర్షి’ సినిమా నుంచి ఆయన కీలక పాత్రలను చేయడం మొదలుపెట్టాడు. ఈ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఈనేపథ్యంలో తాజాగా మరో సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు నరేశ్‌. మంచు మనోజ్ హీరో నటిస్తున్న ‘అహం బ్రహ్మాస్మి’ లో నరేశ్‌ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తుంది.

ముందుగా ఈ సినిమాలో ఈ పాత్రను సాయితేజ్ చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ తాజాగా తెరపైకి ‘అల్లరి’ నరేశ్ పేరు వచ్చింది. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగు ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. త్వరలోనే ఈ షూటింగులో నరేశ్ జాయిన్ కానున్నాడని అంటున్నారు. మనోజ్‌ తన సొంత బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

CLICK HERE!! For the aha Latest Updates