
బాలీవుడ్ ప్రముఖ నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ శుక్రవారం రాత్రి ముంబైలోని నానావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రెగ్యులర్ వైద్య పరీక్షల నిమిత్తం అమితాబ్ బుధవారం ఆస్పత్రిలో చేరారు. అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. అమితాబ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో శుక్రవారం రాత్రి 10గంటలకు డిశ్చార్జి చేశారు. భార్య జయా బచ్చన్, కొడుకు అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఆస్పత్రి నుంచి ఆయన ఇంటికి బయలుదేరారు. అమితాబ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, కాలేయ సంబంధిత వ్యాధితో ఆయన ఆస్పత్రిలో చేరినట్టు కథనాలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసమే ఆయన ఆస్పత్రిలో చేరారని ఆ తర్వాత తెలిసింది.
ఇదిలా ఉంటే, అమితాబ్ ప్రస్తుతం ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన నటిస్తున్న చిత్రం’గులాబు సితాబ్’ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అలాగే రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌తో కలసి ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో కూడా అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం కూడా ఆయన్ను వరించింది.













