అబ్బాయిల నుంచి పెళ్లి ప్రపోజల్స్‌ వస్తున్నాయి: హీరో

తెర మీద తాము చేసే పాత్రలు నటీనటులకు రియల్‌ లైఫ్‌లోనూ ఇబ్బందులను తెచ్చిపెడుతుంటాయి. సినిమాలో విలన్‌ పాత్రల్లో కనిపించేవారిని బయట కూడా ప్రేక్షకులు ద్వేషించటం అనేది కామన్‌. అయితే తాజాగా ఓ బాలీవుడ్ హీరోకు విచిత్రమైన సమస్య ఎదురైంది. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ బయోపిక్‌గా తెరకెక్కిన ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్ సినిమాతో రాహుల్ పాత్రలో నటించిన నటుడు అర్జున్‌ మాథుర్‌.

ఈ సినిమాతో పాటు ఓ వెబ్‌ సిరీస్‌లోనూ నటించిన అర్జున్‌కు ఇప్పుడు ఆ వెబ్‌ సిరీస్‌ కారణంగానే ఇబ్బందులు ఎదురవుతున్నాయట. ‘మేడ్‌ ఇన్‌ హెవెన్‌’ పేరుతో తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్‌లో అర్జున్‌ గే పాత్రలో నటించాడు. దీంతో ఇప్పుడు అర్జున్‌కు అబ్బాయిల నుంచి పెళ్లి ప్రపోజల్స్‌ వస్తున్నాయట. అంతేకాదు కొంత మంది అబ్బాయిలు అభ్యంతరకర సందేశాలు కూడా పంపుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు అర్జున్ మథుర్‌.